25 September 2026, FridayTG66 డిజిటల్ న్యూస్
TG66 డిజిటల్ న్యూస్
tg66.in
లైవ్ అప్‌డేట్స్
బ్రేకింగ్ఖాజాగూడ జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. 60 రోజుల పాటు మళ్లింపులు     •     
తెలంగాణ

ఖాజాగూడ జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. 60 రోజుల పాటు మళ్లింపులు

September 25, 2026 • TG66 డిజిటల్ న్యూస్
WhatsApp Facebook X

పైప్‌లైన్ పనుల నేపథ్యంలో సెప్టెంబర్ 26 నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచన

హైదరాబాద్‌లోని ఖాజాగూడ జంక్షన్‌ వద్ద సెప్టెంబర్ 26 నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. నీటి పైప్‌లైన్ పనుల కారణంగా ఈ మార్పులు చేపడుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

ఈ మార్పుల కారణంగా షేక్‌పేట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ జంక్షన్, నానక్‌రామ్‌గూడ వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

షేక్‌పేట్ ఫ్లైఓవర్ వైపు నుంచి ఖాజాగూడకు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.

గచ్చిబౌలి, బయోడైవర్సిటీ వైపు నుంచి వచ్చే వాహనాలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.పనులు కొనసాగుతున్న సమయంలో ఖాజాగూడ జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.